హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌కు మరో పతకం ఖాయం

బాక్సర్ కపిల్ పోఖరియా ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకాన్ని ఖరారు చేశాడు. పురుషుల 90 కేజీల క్వార్టర్ ఫైనల్ పోరులో అద్భుత విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లాడు. సౌత్ కొరియా బాక్సర్ కిమ్ గిచేను 5-0తో పూర్తిగా ఏకపక్షంగా ఓడించాడు. బాక్సింగ్‌లో సెమీఫైనల్ చేరితే కనీసం కాంస్య పతకం లభిస్తుంది. ఈ విజయంతో ప్రస్తుత ఆసియా క్రీడల బాక్సింగ్ విభాగంలో భారత్‌కు ఆరో పతకం ఖాయమైంది.