హైదరాబాద్: 28°C
క్రీడలు

పీటీ ఉష రికార్డు బ్రేక్.. కాంస్యం గెలిచిన విద్యా

ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ విద్యా రామ్‌రాజ్ కాంస్యం గెలుచుకుంది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్ రేసును 54.75 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. అంతేకాకుండా, పీటీ ఉష పేరిట ఉన్న 42 ఏళ్ల నాటి జాతీయ రికార్డు(55.42 సెకన్లు)ను బద్దలు కొట్టింది. కాగా, ప్రస్తుత ఆసియా క్రీడల్లో విద్యా 4x400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో రజత పతకం కూడా గెలుచుకోవడం విశేషం.