NZB: నిజామాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ గడ్డం కరుణాకర్ దుబాయిలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కరుణాకర్ మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని, తక్షణమే ప్రభుత్వ సాయం అందించాలని నాయకపోడు జిల్లా అధ్యక్షుడు గాండ్ల రామచందర్ ప్రభుత్వాన్ని కోరారు. యువత ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితులు రాకుండా ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
తెలంగాణ
మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని వినతి


