హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్

KKD: ఇటీవల కురిసిన వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాకినాడ అర్బన్ 43, 48, 49వ వార్డులను కలెక్టర్‌ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌ సోమవారం పరిశీలించారు. ముంపు నీటిని వెంటనే తొలగించి, రాకపోకలు పునరుద్ధరించాలని కార్పొరేషన్‌ కమిషనర్‌ను ఆదేశించారు. గాడేరు కాలువలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించాలని సూచించారు.