నగరంలోని 31, 32 డివిజన్ల పరిధిలో సోమవారం అంగన్‌వాడీ ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ కనీస వేతన సలహా మండలి డైరెక్టర్ విభూది సూరిబాబు, మధుసూదనరావు, సవ్వన ఉమామహేశ్వరి, డా. గంజి ఎజ్రా, సీడీపీఓ నాగరాణి పాల్గొన్నారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్‌వాడీ ఉత్సవంలో సీమంతం, అన్నప్రాశన


