హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భగత్ సింగ్ నేటి యువతకు స్ఫూర్తిదాయకం

VZM: సర్దార్ భగత్ సింగ్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంత్రి క్యాంప్ కార్యాలయం నందు సోమవారం భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. బ్రిటిష్ వారిని భారతదేశం నుండి తరిమికొట్టటానికి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ప్రజలను చైతన్యపరిచిన మహనీయుడు భగత్ సింగ్ అన్నారు.