ASF: రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ క్వార్టర్ల కోసం నూతన అంగన్వాడీ కేంద్రం మంజూరు చేయాలని వార్డు సభ్యుడు పూదరి సాయి కోరారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా పాలనాధికారి హరితకు వినతిపత్రం అందజేశారు. గోలేటిలో 10 వేలకుపైగా జనాభా ఉందని, ప్రస్తుతం ఉన్న కేంద్రాలు సరిపోవడం లేదన్నారు. ప్రజలకు అంగన్వాడీ కేంద్రాలు దూరంగా ఉన్నందున కొత్త కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు.
తెలంగాణ
VIDEO: 'నూతన అంగన్వాడీ కేంద్రం మంజూరు చేయాలి'


