హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిలో 140 దరఖాస్తుల స్వీకరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 140 దరఖాస్తులు వచ్చాయని డీఆర్వో జయశ్రీ తెలిపారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ అర్జీలు స్వీకరించి గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో 4, వేములవాడలో 2 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.