KNR: శంకరపట్నం మండలంలోని పలు ఎరువుల దుకాణాలలో నకిలీ/అనుమతి లేని ఎరువుల అమ్మకాలపై రూరల్ సీఐ శ్రీనివాస్ తనిఖీలు నిర్వహించారు. స్టాక్ రికార్డులు, గోదాం నిల్వలు ఇతర అనుమతి పత్రాలు పరిశీలించడం జరిగింది. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ శ్రీధర్, ఏఓ వెంకటేష్, ఏఎస్ఐ సంపత్ పాల్గొన్నారు.
తెలంగాణ
పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన సీఐ


