NRPT: మాగనూరు మండలం అడవి సత్యారం, అమ్మపల్లి శివార్లలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు వెంకటరాములు ఆరోపించారు. వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా వాగులు, కృష్ణానది నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాంరెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని డిమాండ్


