హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యర్థాల నిర్వహణపై పటిష్ట చర్యలు: కలెక్టర్

ATP: అనంతపురం జిల్లాలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026ను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నాలుగు రకాల వ్యర్థాల విభజనను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్‌పై దృష్టి పెట్టాలన్నారు.