హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

BHNG: సంస్థాన్ నారాయణపురం మండలంలోని జనగాం గ్రామంలో లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ లోడే రఘు గౌడ్ అందజేశారు. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఈ పథకం ఆర్థిక భరోసా కల్పిస్తుందని వారు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు.