హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఫ్రెండ్లీ పోలీస్ విధానం అనుసరించండి'

ATP: కంబదూరు పోలీస్ స్టేషన్‌ను కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో నమోదవుతున్న వివిధ కేసుల వివరాలను ఎస్సై లోకేశ్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. బాధితుల పట్ల ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అనుసరించి, వారికి త్వరితగతిన న్యాయం అందించాలన్నారు.