హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అధికారులు సమన్వయంతో పనిచేయాలి'

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి నూతన కలెక్టరేట్ ప్రారంభానికి వస్తున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. సీఎంఓ సెక్యూరిటీ అధికారులు, సీపీ గౌస్ ఆలంతో కలిసి హెలిప్యాడ్, కలెక్టరేట్‌ను పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పటిష్ట బందోబస్తు ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.