హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రోజూ ఒక కప్పు పెరుగుతో అనేక లాభాలు

పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరచి గ్యాస్, అజీర్తి సమస్యలను దూరం చేస్తాయి. అలాగే ఇందులో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలను బలంగా మారుస్తుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, అలసటను తగ్గించడంలో పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది శరీరాన్ని డీహైడ్రేషన్ బారి నుండి కాపాడుతుంది.