హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తుల కోసం షెడ్డు నిర్మాణం..

CTR: సదుం మండలంలోని భట్టువారిపల్లె భారతం మిట్ట వద్ద భక్తుల సౌకర్యం కోసం పీ.ఎల్.ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో షెడ్ నిర్మిస్తున్నారు. సోమవారం షెడ్ కోసం గడ్డర్ల ఏర్పాటు పనులకు వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి పూజ చేసి ప్రారంభించారు. మహాభారత యజ్ఞం సమయంలో ఉత్సవాలకు వచ్చే, తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు షెడ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు.