MBNR: కేంద్రంలో బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్ ఎదుట సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
BJP కుట్రలను ప్రజలు తెలుసుకోవాలి: మిథున్‌రెడ్డి


