హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దరఖాస్తుల గడువు పొడిగింపు: DEO

CTR: చిత్తూరు జిల్లాలోని ఎస్జీటీ, పీఈటీ ఉపాధ్యాయులు ఇన్-సర్వీస్ బీఈడీ, బీపీఈడీ చేసేందుకు దరఖాస్తుల గడువును అక్టోబరు 31 వరకు పొడిగించినట్లు డీఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. సంబంధిత డీడీవో ద్వారా దరఖాస్తు ప్రతిపాదనలను గడువులోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. గడువు తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని డీఈవో స్పష్టం చేశారు.