హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోనిలో ఘోర రోడ్డు ప్రమాదం

KRNL: ఆదోని సమీపంలోని నెట్టేకల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 13 మంది కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురై బోల్తాపడింది. స్థానికుల వివరాల మేరకు.. ఎదురుగా వస్తున్న బైక్‌, ఆటో ఢీకొన్నాయి. ప్రమాదంలో లక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8 మందికి గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.