హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

NLR: వెంకటాచలం మండలం సరస్వతీ నగర్ పంచాయతీ పరిధిలోని ఎర్రగుంటలో టీడీపీ పార్టీ యువ నాయకులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శృతి సోమవారం పర్యటించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రజా సమస్యలపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారంతో పాటు అక్కడ వసతులను పరిశీలించారు.