CTR: సమస్యల పరిష్కారం కోసం చౌడేపల్లె తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు చేపట్టిన నిరసన సోమవారం కొనసాగింది. పే స్కేల్ అమలు చేయాలని, పదోన్నతులు కల్పించాలని, కారుణ్య నియామకాల ప్రక్రియ నిబంధనల మేర చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యలు పరిష్కరించాలని నిరసన


