హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే రాయితీలు పునరుద్ధరించాలి

SKLM: కోవిడ్‌ సమయంలో నిలిపివేసిన సీనియర్‌ సిటిజన్ల రైల్వే చార్జీల రాయితీలను పునరుద్ధరించాలని సీనియర్‌ సిటిజన్స్‌ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వయోధికుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు.