హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గండిక్షేత్రం లడ్డూ ప్రసాదం ధర పెంపు

KDP: గండిక్షేత్రంలోని శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానంలో 200 గ్రాముల లడ్డూ ప్రసాదం ధరను రూ.50 నుంచి రూ.60కి పెంచారు. ఈ మేరకు ఆలయ EO విశ్వనాథ్ తెలిపారు. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి, పంచదార, శనగపప్పు తదితర ముడిసరుకుల ధరలు పెరగడంతో తయారీ వ్యయం అధికమైందన్నారు. పాత ధరకే లడ్డూలను విక్రయిస్తే దేవస్థానంపై అదనపు ఆర్థిక భారం పడుతున్నందున ధర పెంచినట్లు EO పేర్కొన్నారు.