కర్నూలు కోట్ల సర్కిల్‌లో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాస్వామ్యానికి నష్టం జరుగుతోందని నాయకులు ఆరోపించారు. ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగిస్తున్నారంటూ విమర్శించారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి'


