హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ ఛైర్ పర్సన్ దావ స్వాతి సోమవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రూ. 8లక్షల ఎమ్మెల్యే CSR నిధులతో నిర్మించనున్న ఈ రోడ్డుతో వార్డ్ ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయని తెలిపారు. కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ దామెర విజయ, తదితరులు పాల్గొన్నారు