హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కౌతాళంలో రోడ్లకు భూమిపూజ

KRNL: కౌతాళం (మం) బాదినేహాల్‌ నుంచి హోసళ్లి వరకు రూ.6.03 కోట్లతో చేపట్టనున్న రెండు రోడ్డు పనులకు మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎన్.రాఘవేంద్రరెడ్డి సోమవారం భూమిపూజ చేశారు. కూటమి ప్రభుత్వం నిధులతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. త్వరలో నియోజకవర్గంలో మరో రూ.11 కోట్లతో సీసీ రోడ్ల పనులు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు.