KDP: సిద్ధవటం మండలంలోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం పాఠశాల తల్లిదండ్రుల కమిటీ (ఎస్ఎంసీ) ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎంఈఓ-2 అరుణ తెలిపారు. సోమవారం సిద్ధవటంలో ఆమె మాట్లాడుతూ.. వివాదాస్పదంగా ఉన్న పాఠశాలల్లో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఎన్నికల్లో పాల్గొని కమిటీని ఎన్నుకోవాలని ఆమె సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాల కమిటీల ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు: MEO


