JGL: ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి 62 వినతులను స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులు అర్జీలపై సమగ్ర విచారణ జరిపి, పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
తెలంగాణ
ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కరించాలి: కలెక్టర్


