హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రి ముంపు సమస్యకు రూ. 300 కోట్లతో పనులు

E.G: రాజమండ్రి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా రూ. 300 కోట్ల హెచ్ఏఎం నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి కంబాల చెరువు వద్ద పనులకు శంకుస్థాపన చేశారు. హైటెక్ బస్టాండ్‌లో రూ. 8 కోట్లతో డ్రెయిన్, రోడ్ల ఎత్తు పెంపు, కంబాల చెరువు–నల్లా ఛానల్ డ్రెయిన్‌కు రూ. 25 కోట్లతో పనులు చేపట్టారు.