హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్వతీపురంలో తీరని తాగునీటి సమస్య

PPM: పార్వతీపురం పట్టణంలో స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం 1, 2, 3, 19, 29వ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యుడు బి.వి. రమణ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంగా మారినా తాగునీటి సమస్య పరిష్కారం కాలేదన్నారు.