PDPL: సమీకృత కలెక్టరేట్ లో స్వీకరించిన ఆర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు ఆదేశించారు. సోమవారం ఆయన ఐడీఓసీలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, సాదా బైనామా, తదితర సమస్యలపై ప్రజలు దరఖాస్తులు అందజేశారు. సంబంధిత అధికారులకు దరఖాస్తులను పంపి, పరిష్కరించాలని ఆయన సూచించారు.
తెలంగాణ
ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్


