కోనసీమ: కేదార్‌నాథ్ యాత్రలో రాయవరం వాసులు చిక్కుకున్నారు. యాత్ర ముగించుకుని తిరిగి వచ్చే సమయంలో కొండ చరియలు విరిగిపడడంతో మార్గమధ్యంలో రాయవరంకి చెందిన కృష్ణారెడ్డి, సుబ్బారావు అక్కడ చిక్కుకుపోయారు. వీరు ఈ నెల 19న హైదరాబాద్ నుంచి యాత్రకు వెళ్లారు. తమతో పాటు సుమారు 15 వేల మంది యాత్రికులు అక్కడ చిక్కుకున్నట్లు కృష్ణారావు ఫోన్లో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న రాయవరం వాసులు


