హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు

కృష్ణా: అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జాషువా తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన మహాకవి అని ఆయన కొనియాడారు.