హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

52 రోజులపాటు ఉచిత ఆటోమొబైల్‌ శిక్షణ: MPDO

E.G: గొల్లపూడి ఆటోమోటివ్‌ 4 డబ్ల్యూ ట్రైనింగ్‌ సెంటర్‌లో అర్హులైన యువతకు 52 రోజులపాటు ఉచిత ఆటోమొబైల్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంపీడీవో గోవిందు తెలిపారు. 18–30 ఏళ్లు ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు షోరూమ్‌ హోస్టెస్‌, పురుషులకు ఈవీ, పెట్రోల్‌, డీజిల్‌ మెకానిక్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉచిత భోజనం, వసతి, ఎన్‌ఎస్‌డీసీ సర్టిఫికెట్‌, ప్లేస్‌మెంట్‌ అందిస్తామన్నారు.