హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్ఐఆర్ ప్రక్రియలో అక్రమాలను అరికట్టాలి: మంత్రి

WNP: ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలను వెంటనే అరికట్టాలని మంత్రి వాకిటి శ్రీహరి డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరూ అన్యాయంగా తొలగిపోకూడదని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.