హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువత ప్రతిభకు యువజనోత్సవాలు వేదిక

VZM: యువత తమ ప్రతిభను చాటుకునేందుకు జిల్లా స్థాయి యువజనోత్సవాలు–2026ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 30న ఉదయం 9 గంటలకు విజయనగరం మహారాజా అటానామస్ కళాశాలలో సెట్విజ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.