హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుదాఘాతానికి గురై గేదె మృతి

AKP: అచ్యుతాపురం మండలం దోసూరు పంచాయతీ గండివాణిపాలెం నుంచి గొల్లలపాలెం వెళ్లే మార్గంలో విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. ఈ వైర్లను తాకడంతో సోమవారం పైల అప్పలనాయుడుకు చెందిన గేదె విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. దీంతో రైతు కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గేదె మృతితో తమ జీవనోపాధికి నష్టం వాటిల్లిందని వారు కన్నీరుమున్నీరయ్యారు.