హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తమ భూములకు రస్తా ఏర్పాటు చేయండి'

KRNL: పెద్దకడబూరు (మం) H.మురవణిలో ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన రైతుల భూములకు రస్తా ఏర్పాటు చేయాలని కోరుతూ.. గ్రామస్థులు PGRSలో MRO వలీబాషకు వినతిపత్రం అందజేశారు. సుమారు 200 ఎకరాల భూములకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పండించిన పంటలను, ఎరువులను పొలాలకు తరలించేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నామన్నారు.