హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీవితంపై విరక్తితో వివాహిత ఆత్మహత్య

JGL: గొల్లపల్లి మండలం శంకర్రావుపేటకు చెందిన గాజుల లత (48) క్యాన్సర్ గడ్డలతో కొంతకాలంగా బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో తన వ్యవసాయ బావిలో దూకి మృతి చెందింది. మృతురాలి తమ్ముడు గోలి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి తెలిపారు.