ELR: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం వీఆర్ఏలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చాలీచాలని జీతంతో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ చెవులు పట్టుకుని నిరసన తెలియజేశారు. ఆ సంఘం మండల అధ్యక్షులు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి టేకి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వీఆర్ఏలు వినూత్న నిరసన..!


