హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిలిచిన బస్సు రాక.. ఇబ్బందుల్లో ప్రజలు..!

KDP: నాగాయపల్లికి కడప- పెండ్లిమర్రి మార్గంలో నడిచే RTC బస్సు గ్రామంలోకి రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బైపాస్ వద్దే బస్సు నిలిపివేయడంతో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు అర కిలోమీటరు నడవాల్సి వస్తోందని వాపోతున్నారు. మార్కెట్లు, బ్యాంకులకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అధికారులు బస్సును గ్రామంలోకి పునరుద్ధరించాలని కోరుతున్నారు.