బాపట్ల బీజేపీ కార్యాలయంలో భగత్ సింగ్ జయంతి వేడుకలను ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ తాడివలస దేవరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంపల్లి జగన్నాధ శాస్త్రి భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన త్యాగాలు స్ఫూర్తిదాయకమని, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా భగత్ సింగ్ జయంతి


