హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎరువుల దుకాణాల్లో అధికారుల తనిఖీలు

KNR: శంకరపట్నం మండలం కేశవపట్నంలో వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్, హుజురాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన ఎన్‌పీకే మిక్చర్ ఎరువులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన ఎరువులనే విక్రయించాలని సూచించారు. తనిఖీల్లో ఏఎస్ఐ సంపత్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.