KMM: ప్రజలు అందించే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డితో కలిసి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన ఆయన పరిష్కారంపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
'ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి'


