SRCL: వేములవాడలో నూతనంగా ఏర్పడిన పీఏసీఎస్ సర్వసభ్య సమావేశానికి మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రైతులకు రుణాలు, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించి అండగా నిలవాలని సూచించారు. సంఘం పరిధిలోని 22 గ్రామాల రైతుల సమస్యల పరిష్కారానికి పాలకవర్గం కృషి చేయాలని అన్నారు.
తెలంగాణ
'రైతుల సంక్షేమమే సహకార సంఘాల లక్ష్యం'


