హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రాష్ట్రస్థాయి క్రీడా ఉత్సవాలు ప్రారంభం'

భూపాలపల్లి జిల్లాలో జిల్లా క్రీడా అధికారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి క్రీడా ఉత్సవాలను MLA గండ్ర సత్యనారాయణరావు సోమవారం ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఎమ్మెల్యే వారితో కలిసి కబడ్డీ ఆడి ఉత్సాహపరిచారు. గ్రామీణ ప్రాంత ప్రతిభను ప్రోత్సహించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.