హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్జీలు స్వీకరించిన మంత్రి పయ్యావుల

ATP: అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజా సమస్యల పరిష్కారానికి 'ప్రజాదర్బార్' నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులను స్వీకరించారు. బాధితుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.