VSP: అల్లిపురం మెయిన్ రోడ్డు గాంధీబొమ్మ సమీపంలో శ్రీ ధనశక్తి దుర్గాదేవి ఆలయ పీఠం ఆధ్వర్యంలో జరగబోయే దసరా ఉత్సవాలకు ఇవాళ శ్రీకారం చుట్టారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు ఉత్సవ రాటను వేశారు. అనంతరం ఆలయ పీఠాధిపతి రవివర్మ ఉత్సవ తేదీలను ప్రకటించారు. అక్టోబరు 11 నుంచి 20 వరకు నవరాత్రులు జరుగుతాయని, ప్రతిరోజు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'దసరా ఉత్సవాలకు శ్రీకారం'


