హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటి పట్టాలను అందజేసిన మంత్రి సవిత

సత్యసాయి: పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు వెంకటాపురం తండా, పరమేశ్వరపురం గ్రామాల్లో మంత్రి సవిత పర్యటించారు. ప్రజలను నేరుగా కలుసుకుని సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఇంటి పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.