ASF: దహెగాం మండల కేంద్రంలో DYFA ఆధ్వర్యంలో సోమవారం భగత్ సింగ్ జయంతి నిర్వహించారు. ఈ సందర్బంగా DYFA మండల కార్యదర్శి దత్తాత్రేయ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్రం కోసం భగత్ సింగ్ చేసిన త్యాగాలు, ఆయన ఆలోచనలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. 'ఇంక్విలాబ్ జిందాబాద్' నినాదం ప్రజల్లో చైతన్యం నింపిందని తెలిపారు.
తెలంగాణ
VIDEO: 'భగత్ సింగ్ చేసిన త్యాగాలు స్ఫూర్తిదాయకం'


